TDP, YSRCPలు పోలవరం డెడ్‌లైన్లు ఎందుకు అమలు చేయలేదు? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాయి?

వీడియో క్యాప్షన్, ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాయి?
ప్రచురణ

పోలవరం ప్రాజెక్టులో మంత్రులు మాట నిలబెట్టుకోలేకపోవడానికి కారణాలేంటి, ఈ ప్రాజెక్టు నిర్మాణ జాప్యంలో ఎవరి పాత్ర ఎంత?

‘‘పోలవరం ప్రాజెక్టుని 2018 మార్చి నాటికే పూర్తి చేస్తాం. రాసిపెట్టుకో’’ - ఇవీ అప్పటి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మాటలు. 2016 మార్చి 10న ఏపీ అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.

‘‘తొందరెందుకు కన్నా.. 2021 డిసెంబర్ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం’’ - ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖా మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలోనూ, వెలుపలా చెప్పినవి. 2020 డిసెంబర్ లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.

ఈ ఇద్దరు మంత్రులు చెప్పిన మాటలు అమలుకి నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)