‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ద్వారా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎలా పరిష్కరిస్తున్నారు

ప్రచురణ

"అమ్మా..బాగున్నావా, ఆసరా పథకమొచ్చిందా"

"అవ్వా.. ఎట్టున్నావ్, పెన్షన్ అందుతుందా"

"ఏరా స్కూలుకి పోలేదా..." ఇట్టా సాగుతుంది ఆయన పలకరింపు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తన దగ్గరికి వచ్చిన వారితోనే కాకుండా, తాను నడిచివెళుతున్న దారిలో కనిపించిన అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఊరూ, వాడా తిరుగుతూ ఉదయాన్నే అందరినీ పలకరిస్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న ప్రయత్నం చర్చనీయమవుతోంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో దానికి విస్తృతంగా ప్రచారం లభించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అసలు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎలా మొదలయ్యింది.. ఎందుకంత ప్రచారం వస్తోందన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)