You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ తయారు చేస్తున్న తెలంగాణ టీనేజీ అమ్మాయి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ములకలపల్లి తండాకు చెందిన 16 ఏళ్ల ధీరావతి అనితకు ఒక భిన్నమైన ఆలోచన వచ్చింది.
చవకైన, శుభ్రమైన శానిటరీ పాడ్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. తన తండాలోని మహిళలకు, అలాగే తోటి విద్యార్థినులకు వీటి తయారీపై అవగాహన కూడా కల్పిస్తోంది. ఆమె పదోతరగతి చదువుతోంది.
ప్రత్యేక శానిటరీ ప్యాడ్లను తయారుచేసినందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో అనితకు ఒక అవార్డును ప్రదానం చేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యంగ్ అచీవర్స్ అవార్డు విజేతల్లో ఆమె కూడా ఉన్నారు.
గుర్రపు డెక్కతో శానిటరీ ప్యాడ్స్ తయారీ..
ఒకప్పుడు తండాలోని మహిళలు రుతుస్రావం సమయంలో వస్త్రంతోపాటు గుర్రపుడెక్కను వాడేవారు. ఇలా ఎందుకు వాడుతున్నారు, దీనితో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహం అనితకు వచ్చింది.
2019లో దీని గురించి ఆమె ఇంటర్నెట్‌లో వెతికారు. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యకు ఇది పరిష్కారం చూపుతుందని ఆమె తెలుసుకొన్నారు. అ
ప్పుడు తన టీచర్, కొంత మంది స్నేహితుల సహాయంతో అనిత.. గుర్రపుడెక్క, పసుపు, మెంతులు, సబ్జా గింజలతో ఈ శానిటరీ పాడ్స్ తయారు చేశారు.
వీటి తయారీకి 3 -4 రోజులు పడుతుందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చనని అనిత చెబుతోంది. ఈ ప్యాడ్‌కు స్త్రీ రక్ష అని పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
- మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని తలలో మేకు కొట్టిన భూత వైద్యుడు
- అమరావతి: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?
- సౌర తుపానులో చిక్కుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు
- కర్ణాటక హిజాబ్ వివాదం: అల్లాహు అక్బర్ అన్న విద్యార్థిని ముస్కాన్ వీడియోపై పాకిస్తాన్ ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)