ఏపీ: PRCకి వ్యతిరేకంగా ఉద్యోగుల 'చలో విజయవాడ', జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేతన సవరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఈరోజు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి.
నగరంలోకి చేరుకున్న ఉద్యోగులు రహదారులపై భారీగా గుమిగూడారు. జగన్ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొత్త పీఆర్సీ అమలును నిలిపివేసి మరోసారి చర్చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం జనవరి 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి వేతనాల్లో ఉద్యోగులు, ఫించనుదారుల వేతనాల్లో కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు వేసింది.
దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు(గురువారం) 'చలో విజయవాడ'కు తరలిరావడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చాలా చోట్ల పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ విజయవాడ వెళ్లకుండా చాలా చోట్ల అడ్డంకులు సృష్టించారు.
కానీ, చలో విజయవాడకు చాలా మంది ఉద్యోగులు కనకదుర్గ భక్తుల్లా, పెళ్లివారి వేషంలో విజయవాడలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)