రికార్డులు సృష్టించిన ‘మంచి తల్లి’కి కన్నీటి వీడ్కోలు..

వీడియో క్యాప్షన్, దేశంలోనే రికార్డులు సృష్టించిన ‘మంచి తల్లి’కి కన్నీటి వీడ్కోలు..
ప్రచురణ

భారత్‌లో ''సూపర్‌ మామ్''గా ప్రఖ్యాతిగాంచిన ''కాలర్‌వాలీ'' సాధారణమైన ఆడ పులి కాదు.

16 ఏళ్ల వయసులో జనవరి 15న కాలర్‌వాలీ మరణించింది. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ పులుల అభయారణ్యానికి ఈ ఆడ పులి మంచి పేరు తీసుకొచ్చింది.

రేడియో కాలర్ వేయడంతో ఈ పులిని ''కాలర్‌వాలీ''అని పిలుస్తుండేవారు. ఎనిమిది ప్రసవాల్లో ఇది 29 పిల్లలకు జన్మనిచ్చింది. ఇదొక అద్భుతమైన రికార్డని జంతు నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ ''స్పై ఇన్ ద జంగిల్''లో కనిపించిన తర్వాత దీని పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి. రెండేళ్లలో నాలుగు పులి పిల్లల జీవితాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.

వయసు పైబడటంతో వచ్చే అనారోగ్యంతో కాలర్‌వాలీ మరణించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)