తెలంగాణ: నల్లగొండలో హత్య నరబలి కోసమే జరిగిందా?

వీడియో క్యాప్షన్, నల్గొండలో హత్య నరబలి కోసమే జరిగిందా?
ప్రచురణ

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్ దగ్గర జరిగిన హత్యకు సంబంధించి మృతుడి మొండెం ఇంకా దొరకలేదు. చనిపోయిన వ్యక్తి సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన జయేందర్ నాయక్ అని గుర్తించారు.

గుర్తు తెలియని వ్యక్తులు.. జయేందర్ మొండెం నుంచి తలను వేరు చేసి, రక్తం ఓడుతున్న తలను హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారి పక్కనున్న మెట్టు మహంకాళి అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టారు. జనవరి 10న ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారి ఈ తలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)