సల్మాన్ ఖాన్: పామును కర్రతో బయటకు తీసుకెళ్తుంటే, మూడు సార్లు కాటేసింది
శనివారం రాత్రి సల్మాన్ ఖాన్‌ను ఒక పాము కాటు వేసింది. ఆస్పత్రిలో కోలుకున్న ఆయన తనను పాము ఎలా కాటేసిందో చెప్పారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
"నా ఫాంహౌస్‌లోకి ఒక పాము వచ్చింది. నేను ఒక కర్రతో దాన్ని బయట వదిలేద్దామని తీసుకెళ్లా. అది మెల్లగా నా చేతిపైకి వచ్చేయడంతో, దాన్ని పట్టుకుని విడిపించడానికి ప్రయత్నించా. అప్పుడే అది నన్ను మూడుసార్లు కాటేసింది. అది ఒక రకమైన విషపూరిత పాము. నాకు 6 గంటలు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను" అని సల్మాన్ చెప్పారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి తన పన్‌వెల్ ఫామ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.
పాము కరవడంతో ఆయన్ను శనివారం రాత్రి 3.30 సమయంలో నవీ ముంబయిలో ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స తర్వాత కొన్ని గంటలకే డిశ్చార్జ్ చేశారు.
డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఆయన ఎక్కువగా పన్‌వెల్ పాంహౌస్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటారు.
ఇవి కూడా చదవండి:
- ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అయినా, చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
- పాప మెడకు చుట్టుకుని కాటేసిన తాచుపాము
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.