సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌‌కి ప్రమాదం

ప్రచురణ

భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలీకాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారని భారత వాయుసేన తెలిపింది.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని పేర్కొంది.

హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు, గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. వారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్‌లు ఉన్నారని ట్వీట్ చేసింది.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)