ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?

వీడియో క్యాప్షన్, ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?
ప్రచురణ

ఐఐటీ బాంబేలో చదువుకున్న పరాగ్ అగర్వాల్ ట్విటర్‌కు కొత్త సీఈవోగా నియమితులయ్యారు.

ట్విటర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సీ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. జాక్ డోర్సీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయంతో పాటు పరాగ్ అగర్వాల్ నియామకాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

పరాగ్ అగర్వాల్‌ను ట్విటర్‌ సీఈవోగా ఎందుకు నియమించారో కూడా ఆయన ట్వీట్‌లో వివరించారు.

''ట్విటర్‌కు సహవ్యవస్థాపకుడిగా, సీఈవోగా, చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, తాత్కాలిక సీఈవోగా తదితర పదవుల్లో 16 సంవత్సరాల పాటు పని చేశాను. ఇప్పుడు వాటిని వదలిపెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కానీ ఎందుకు?''

''మొదటిది, పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవో కాబోతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత మా కంపెనీ బోర్డు, పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఈ పదవి కోసం ఎన్నుకుంది. కంపెనీతో పాటు దాని అవసరాలను పరాగ్ లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే చాలా కాలంగా నేను ఆయనను అభిమానిస్తున్నా'' అని డోర్సీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)