కారం శ్రీలత సక్సెస్ స్టోరీ: కోయగూడెం నుంచి ఐఐటీ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఒక కోయగూడేనికి చెందిన కారం శ్రీలత సక్సెస్ స్టోరీ ఇది.
తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని, తాము ప్రయాణించేందుకు సైకిల్ తప్ప బైకు లేదని, చాలాకాలం పాటు తమ ఇంటికి విద్యుత్ కనెక్షన్ లేదని శ్రీలత చెప్పారు.
పదవ తరగతి వరకూ ఈమె తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఇంటర్‌లో భయపడుతూనే ఇంగ్లీషు మీడియంలో చేరారు.
ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ఫోన్ లేకపోతే.. తల్లిదండ్రులు అప్పు చేసి ఫోన్ కొనిచ్చారు.
ఎంతో కష్టపడి ఐఐటీ వారణాసి (IIT-BHU)లో సీటు సంపాదించినా.. అక్కడికి వెళ్లేందుకు, ఫీజు కట్టేందుకు కూడా డబ్బుల్లేవు.
ఇంతటి పేదరికంలో ఉన్న కారం శ్రీలత స్టోరీ తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?
- ‘రూ.15 లక్షలు, ఉద్యోగం పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేవుగా’ - తెలంగాణ హైకోర్టు
- టీ20 ప్రపంచ కప్: ఫైనల్ చేరిన న్యూజీలాండ్
- శిథిలమైన ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి ఫొటోకు మొదటి బహుమతి
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
- ‘మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం’
- అడవిలో ఒంటరిగా 40 ఏళ్లు జీవించిన ఆ వ్యక్తి గురించి బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)