పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికొచ్చి, డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన హైదరాబాద్ టెకీ మృతదేహం లభ్యం

వీడియో క్యాప్షన్, కిలోమీటర్ వరకూ మ్యాన్‌హోల్స్ అన్నీ తవ్వి తీస్తే కానీ మృతదేహం దొరకలేదు
ప్రచురణ

హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు.

ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చారని, నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.

ఈ మృతదేహం కోసం రెండు రోజులు గాలించారు. గోల్డెన్ టెంపుల్ నుంచి నెక్నాంపూర్‌ చెరువు వరకు దాదాపు కిలోమీటర్ మేర అన్ని మ్యాన్‌హోల్స్‌ను తవ్వారు. ఈ క్రమంలో ప్రొక్లెయినర్‌తో వెతుకుతుండగా మృతదేహం దొరికింది.

ఈ మృతదేహం గోల్డెన్ టెంపుల్ వద్ద మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయిన టెకీదేనని పోలీసులు నిర్ధరించారు.

అయితే, కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో డ్రైనేజీలను తెరిచి ఉంచడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)