గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..

వీడియో క్యాప్షన్, గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..
ప్రచురణ

ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు. కళింగపట్నంకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో తుపాను తీరాన్ని తాకిందని, ఇది పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తుపాను తీరం దాటుతుందని, ఈ సమయంలో ఉత్తరాంధ్రలో సముద్ర తీరం వెంబడి గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)