నరేంద్ర మోదీ: యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ పేరెత్తకుండా వార్నింగ్ ఎలా ఇచ్చారంటే...

ప్రచురణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందించేందుకు వాడకుండా చూడాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

ఇంకా మోదీ ఏమన్నారంటే..

''తీవ్రవాదాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే.. తీవ్రవాదం వాళ్లకు కూడా అంతే ప్రమాదకరం. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాద దాడుల కోసం కానీ, తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు గానీ ఉపయోగించుకోకుండా చూడాలి.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న సున్నితమైన పరిస్థితులను కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం, ఒక అస్త్రంగా వాడుకోకుండా చూడాలి.

అఫ్గానిస్తాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు, మైనార్టీలకు సహాయం అవసరం. ఈ మేరకు మనమంతా ముందుకురావాలి, సహాయం అందించాలి.''

"ప్రపంచమంతా గత 100 సంవత్సరాలలో ఎన్నడూ చూడని మహమ్మారిని గత సంవత్సరంన్నర కాలంగా ఎదుర్కొంటోంది. కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నేను నివాళి సమర్పిస్తున్నాను. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను" అని ప్రధాని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)