‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని’ - ఏపీ మంత్రి మేకపాటి

వీడియో క్యాప్షన్, ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని’ - ఏపీ మంత్రి మేకపాటి
ప్రచురణ

‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదు’ అని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం రాజధాని అనే సబ్జెక్టే లేదు. సీఎం ఎక్కడ నివాసం ఉంటే అదే రాజధాని అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియేట్, రాజధాని అవుతుంది. నేను రాజ్యాంగం ప్రకారం చెబుతున్నాను. ఆర్టికల్ చాలా స్పష్టంగా చెబుతోంది.. రాజధాని అనే అంశమే లేదని. రాజధాని ఏంటంటే.. అడ్మినిస్టేటివ్.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో.. ఆయన ఎక్కడ పనిచేస్తారో.. అక్కడే సచివాలయం ఉంటుంది. అది పులివెందుల కావొచ్చు. విజయవాడ కావొచ్చు. లేకపోతే రేపు వైజాగ్ కూడా కావొచ్చన్నమాట’’ అని గౌతమ్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)