ముంబయిలో భారీ వర్షాలకు కూలిపోతున్న గోడలు, చనిపోతున్న ప్రజలు

వీడియో క్యాప్షన్, ముంబయిలో భారీ వర్షాలకు కూలిపోతున్న గోడలు, చనిపోతున్న ప్రజలు
ప్రచురణ

శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరంలో చాలా చోట్ల వరదలు ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. బీభత్సం సృష్టించాయి.

చెంబూరు భారత్‌ నగర్ ప్రాంతంలో చెట్టు విరిగిపడి గోడ కూలిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. గాయపడిన వారిని రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శిథిలాల నుంచి ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికి తీశామని జాతీయ విపత్తు నిర్వహణ దళం ఇన్‌స్పెక్టర్ రాహుల్ రఘువన్ష్ తెలిపారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశముందని వివరించారు.

ఇక, విఖ్రోలీలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పంచశీల్ చాల్ ప్రాంతంలోని సూర్యనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)