హైదరాబాదీ రోడ్ డాక్టర్: సొంత ఖర్చుతో గుంతలు పూడ్చుతున్న రిటైర్డ్ ఇంజనీర్

వీడియో క్యాప్షన్, హైదరాబాదీ రోడ్ డాక్టర్: సొంత ఖర్చుతో గుంతలు పూడ్చుతున్న రిటైర్డ్ ఇంజనీర్
ప్రచురణ

రోడ్ల మీద గుంతల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను గమనించిన కాట్నం గంగాధర తిలక్ దీన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు.

''ఒక రోజు ఆఫీసుకు వెళ్తూ ఆ గుంత దగ్గర కారు ఆపి చాలాసేపు ఆలోచించాను. ఆ పక్కనే అంతకు ముందు రోడ్డు వేసేప్పుడు తవ్విన తారు పెళ్లలు కనిపించాయి. కొత్త రోడ్డు వేసే ముందు పాత రోడ్డును తవ్వేసి వాటిని అక్కడ పడేశారు. నేను వెంటనే నేను ఒక పెద్ద తారు పెచ్చు తీసుకువచ్చి ఆ గుంతలో వేశాను. తర్వాత దానిపై ఒక బస్సు వెళ్లడంతో అది కాస్త అణిగింది. ఇదేదో బావుందే అని, అక్కడున్న తారు పెళ్లలన్నీ తెచ్చి ఆ గుంతలో వేసాను. కార్లు, బస్సులు వెళ్లాయి. అరగంటలో అక్కడ గుంత చాలా ప్రొఫెషనల్ గా పూడ్చినట్టు తయారైంది. తర్వాత సంతృప్తిగా ఆఫీసుకు వెళ్లాను'' అని తిలక్ వెల్లడించారు.

'రోడ్ల డాక్టర్' అని అందరూ ముద్దుగా పిలుచుకునే గంగాధర తిలక్‌ను కదలిస్తే ఇలాంటి అనుభవాలెన్నో చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)