మహిళా అధికారితో ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రి అలా మాట్లాడొచ్చా?

ప్రచురణ

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను ఆ మహిళ ఉద్యోగిని ఎక్కడ వివాదాస్పదంగా మాట్లాడలేదని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

''మీటింగ్ ప్రారంభయ్యే ముందు మైక్‌లో ఏం కూతురా బాగున్నవా అని పలకరించాను. నాకు ఆమె బాగా తెలిసిన వ్యక్తి. వరంగల్ జిల్లా దుగ్గొండి లో ఎంపీడీవో విధులు నిర్వర్తించారు. అప్పటి నుంచే నాకు పరిచయం.

అక్కడ ఉరికించావు.. ఇక్కడ ఎందుకు ఉరికించట్లేదు అని అడిగాను అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)