ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి కొత్త రికార్డు సృష్టించిన మహిళ

ప్రచురణ

దక్షిణ ఆఫ్రికా రాజధాని ప్రిటోరియాలో ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చారు. వైద్యులు ఇదో ప్రపంచ రికార్డుగా భావిస్తున్నారు. పది మంది పిల్లలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆ పిల్లల తండ్రి టెబోహో సోటేట్సి అన్నారు. తన భార్య గోసియేమ్ థమారే సిట్‌హోలే గర్భంలో 8 పిండాలు పెరుగుతున్నాయని డాక్టర్లు స్కానింగ్‌ చేసి చెప్పారని ఆయన చెప్పారు.