అనంతపురం: తాడిపత్రిలో రెండు వారాల్లో 500 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి నిర్మాణం

ప్రచురణ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్మించిన 500 ఆక్సిజన్‌ పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 5.50 కోట్లతో 13.56 ఎకరాల్లో15 రోజుల్లోనే ఈ‌ ఆస్పత్రిని నిర్మించారు.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల తర్వాత ఇక్కడే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఒక సందర్భంలో జిల్లాలో పాజిటివిటీ రేటు 41 శాతానికి చేరడం ఆందోళన కలిగించింది. దాంతో అనంతపురం జిల్లాలో కరోనా బాధితులకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాడిపత్రి సమీపంలోని అర్జాస్‌ స్టీల్స్‌ ప్రాంగణంలో ఈ ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంది. జర్మన్ టెక్నాలజీతో ఈ సెంటర్ నిర్మించినట్టు అధికారులు వెల్లడించారు. అనంతపురంలోనూ 250 బెడ్స్ తో ఇదే రీతిలో కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు సెంటర్లలోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోగులకు బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఇక ఉండవని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)