కోవిడ్‌తో చనిపోయారన్నారు... అంత్యక్రియలు చేశాక ఇంటికి తిరిగొచ్చారు

వీడియో క్యాప్షన్, కోవిడ్‌తో చనిపోయారన్నారు... అంత్యక్రియలు చేశాక ఇంటికి తిరిగొచ్చారు
ప్రచురణ

విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఘటనలు జరిగినా పాఠాలు నేర్చుకోకుండా చికిత్స పొందుతున్న రోగిని చనిపోయినట్లు నిర్ధారించి, బంధువులకు మృతదేహం అప్పగించడం కలకలం రేపింది.

ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన బంధువులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 15 రోజులకు చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రి నుంచి డిచ్ఛార్జయ్యి నేరుగా ఇంటికి చేరడంతో అందరూ అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)