360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు..టికెట్ రూ.18 వేలే

వీడియో క్యాప్షన్, 360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు..టికెట్ రూ.18 వేలే
ప్రచురణ

హెడ్ లైన్ చూడగానే.. అంత పెద్ద విమానంలో ఆయన ఒక్కడే ఎందుకు వెళ్లాడు అనే మీకు ఆసక్తి కలిగి ఉంటుంది.

స్వయంగా ఆ ప్రయాణికుడికీ అదే అనిపించింది. 360 సీట్లున్న బోయింగ్ విమానంలో తాను ఒక్కడే ప్రయాణించడాన్ని ఆయన ఆస్వాదించారు.

దుబయిలో ఉంటున్న భావేష్, తన వ్యాపారం పనిమీద మే మొదటి వారంలో ముంబయి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్లడానికి పది రోజుల ముందే ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నారు.

ఆయన తరచూ బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ, కరోనా మహమ్మారి వల్ల పెద్దగా రద్దీ ఉండదులే అనుకున్న ఆయన రూ.18 వేలు పెట్టి ఎకానమీ క్లాస్‌లో టికెట్ బుక్ చేశారు.

మే 19న ఉదయం 4.30కు ఫ్లైట్. అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనల ప్రకారం ఆయన ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్-ఇన్ చేస్తున్నప్పుడు ఆ విమానంలో వెళ్లబోతున్న ప్రయాణికుడు తానొక్కడే అనే విషయం భావేష్‌కు తెలిసింది.

పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)