వూహాన్ ల్యాబ్: కోవిడ్-19 మూలాలపై అమెరికా దర్యాప్తు

ప్రచురణ

కోవిడ్-19 ఎక్కడ పుట్టిందో దర్యాప్తు చేయాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

ప్రపంచ మహమ్మారిగా బెంబేలిస్తున్న కోవిడ్ వైరస్ చైనాలోని ఒక ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చనటానికి మరిన్ని ఆధారాలు లభిస్తున్నట్లు ఇటీవలి అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నాయి.

ఈ సిద్ధాంతాన్ని చైనా గట్టిగా నిరాకరిస్తోంది.

ఈ అంశంపై పూర్తి, పారదర్శక దర్యాప్తు చేపట్టాలని చైనాపై అమెరికా, దాని మిత్రదేశాలు ఒత్తిడిని కొనసాగిస్తాయని బైడెన్ చెప్పారు.

కరోనావైరస్ అసలు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందనేది కనిపెట్టటానికి జరుగుతున్న ప్రయత్నాలను రాజకీయం చేయరాదని చైనా ఉన్నతాధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)