రాత్రి 10 గంటలు దాటినా ఆగని పెళ్లి ఫంక్షన్, కలెక్టర్ మెరుపు దాడి... 30 మంది అరెస్ట్

ప్రచురణ

త్రిపురలోని అగర్తలలో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో అగర్తల జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ చర్చనీయంగా మారారు.

కర్ఫ్యూ సమయంలో జరుగుతున్న రెండు పెళ్లి వేదికలపై కలెక్టర్ ఏప్రిల్‌ 26న దాడులు నిర్వహించారు. అక్కడి పరిస్థితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్నవారిని తిడుతూ, కొన్నిసార్లు కొట్టినంత పనిచేశారు. కలెక్టర్ తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత కలెక్టర్ క్షమాపణలు చెప్పారు.