ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా కరోనా విధుల్లో ఉన్న డాక్టర్

వీడియో క్యాప్షన్, ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా కరోనా విధుల్లో ఉన్న డాక్టర్
ప్రచురణ

కోవిడ్‌ తొలి వేవ్‌ నుంచి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వైద్యరంగంలో ఉన్న వారు విశేషంగా సేవలు అందిస్తున్నారు. వైరస్‌ సోకిన వారి దగ్గరకు వచ్చేందుకు సొంత వారే సంకోచిస్తున్న సమయంలో అన్నీ తామై విధులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ శేఖర్ అలాంటి వారిలో ఒకరు.

ఏడాది కాలంగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా కోవిడ్ విధులు నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.

సొంత పనులకు కూడా ఆయన సమయం వెచ్చించింది చాలా తక్కువని, పూర్తి సమయం ఆసుపత్రిలోనే గడిపారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)