నాసిక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్.... 22 మంది మృతి

ప్రచురణ

ఆక్సిజన్ ట్యాంకులో లీకేజ్ వల్ల... సుమారు అర గంటకు పైగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ తీసుకుంటున్న రోగుల్లో తక్కువ ఆక్సిజన్‌తో ఉన్న సరఫరా నిలిచిపోతే బతకడం సాధ్యమేనని, కానీ వెంటిలేటర్ మీద ఉన్న రోగులు మాత్రం ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే బతకడం కష్టమని వైద్యాధికారులు చెప్తున్నారు.

''మా నాయనమ్మకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమయిందని నేను వైద్యులను అడిగితే, ఆక్సిజన్ అయిపోందని చెప్పారు.'' అని విక్కీ జాదవ్ అనే యువకుడు మీడియాతో అన్నారు.

ఈ ఘటనలో విక్కీ జాదవ్ నాయనమ్మ మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)