కైరో వీధుల్లో ప్రాచీన మమ్మీల అద్భుత పరేడ్.. వాటిని ఇప్పుడెందుకు తరలించారు

వీడియో క్యాప్షన్, కైరో వీధుల్లో ప్రాచీన మమ్మీల అద్భుత పరేడ్
ప్రచురణ

కైరో వీధుల్లో ప్రాచీన చక్రవర్తుల ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది.

ఆనాటి పరేడ్‌ను తిరిగి చూసే అవకాశం లభించింది అక్కడి ప్రజలకు.

ఎంతో వైభవంగా.. కొన్ని కోట్ల రూపాయిల ఖర్చుతో ఈ వేడుక నిర్వహించారు.

కళ్లు మిరుమిట్లు గొలిపే ఈ వేడుకలో మొత్తం 22 మమ్మీలతో పరేడ్ చేశారు.

ఈ మమ్మీల్లో 18 మంది రాజులు, నలుగురు రాణులు.

ఈజిప్ట్ మ్యూజియం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త ప్రదేశానికి వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.

వీటిని ఈజిప్ట్ జాతీయ సంపదగా భావిస్తారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య వీటిని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్‌కు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)