రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే

ప్రచురణ

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది.

51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత దేశంలో 1870 ఏప్రిల్ 30న త్రయంబక్ అనే ఊరిలో ఫాల్కే జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది.

ఫాల్కేను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనత ఫాల్కేదే.

సృజనాత్మక కళలంటే చిన్నతనం నుంచే ఫాల్కేకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన కలలను నెరవేర్చుకునే లక్ష్యంతో 1885లో బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ ఆయన ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్‌, డ్రామాలు వేయడం వంటి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. అంతేకాదు, ఇంద్రజాల విద్యలను కూడా అభ్యసించారు.

కొద్దికాలం పాటు ఓ పెయింటర్‌గా, సినిమా సెట్లకు డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మకు చెందిన ప్రెస్‌లో పనిచేస్తుండగా వర్మ గీసిన హిందూ దేవతల చిత్రాలను చూసిన ఫాల్కే వాటినుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)