You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోన్ యాప్స్: అప్పు తీర్చడం ఆలస్యమైతే బూతులు తిడుతున్నారు
హైదరాబాద్‌కు చెందిన వి. కవిత కరోనా సమయంలో ఒక యాప్ ద్వారా లోన్ తీసుకున్నారు. సమయానికి తీర్చలేకపోయారు.
ఉదయం 7 గంటలకే ఆ యాప్ వారు ఫోన్ చేశారు. వేరే పనిలో ఉండి ఒక పది నిమిషాలు ఫోన్ చూసుకోలేదు.
వెంటనే రెండవ ఫోన్ కవిత తమ్ముడి భార్య కజిన్‌కి వెళ్లింది. నిజానికి ఆ బంధువుతో ఈమెకు అంత సాన్నిహిత్యం కూడా లేదు. ఫలానా కవిత మీకు తెలుసా అని అడిగారు యాప్ వారు. అవును మా బంధువే అనగానే, ఆమె కొంత అప్పు తీసుకున్నారు. మీ నంబరు ఇచ్చారు. ఆ అప్పు మీరు తీర్చండి. అన్నారు.
షాక్ అయిన సదరు బంధువు విషయంలో ఇంట్లో చెబితే, ఇప్పుడు బంధువర్గం అంతా కవితను దూరం పెట్టారు.
అప్పు ఇచ్చిన ఒక యాప్ నిర్వాహకులు చేసిన నిర్వాకం ఇది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)