ఒకే వేదికలో తల్లీకూతుళ్ల పెళ్లి
ప్రచురణ
తల్లీకూతుళ్ల పెళ్లి ఒకే దగ్గర, ఒకేసారి జరగడం బహుశా మీరెప్పుడూ చూసుండరు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఒక సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ తల్లీకూతుళ్లు తాము కోరుకున్నవారిని జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు. మొదట 55 ఏళ్ల బేలీ దేవి తన కూతురు ఇందూకు కన్యాదానం చేశారు. తర్వాత తన కొత్త జీవిత భాగస్వామితో ఆమె ఏడడుగులు నడిచారు. బేలీ దేవి భర్త చనిపోయి 25 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ఆమె తన మరిది జగదీశ్‌తో కలిసి మిగతా జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.