‘వాళ్లు మాకు గౌరవం ఇవ్వండి అని అడగరు.. సంపాదించుకుంటారు’

ప్రచురణ

‘‘ఈ సర్దార్జీలు... పంజాబ్ నుంచీ వచ్చిన రైతులు... వీళ్లందరూ చాలా మంచివాళ్లు. వీళ్లని ఎంత పొగిడినా తక్కువే. మావల్ల ఏ ఇబ్బందీ లేదు కదమ్మా అని ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. నేను దిల్లీలో కాకుండా పంజాబ్‌లో నివసిస్తూ ఉంటే బావుండేది...’’ అని చెప్తున్నారు రూబీ ఉపాధ్యాయ్.

ఆమె, ఆమె భర్త దిల్లీ సరిహద్దు వద్ద ఒక ధాబా నడుపుతున్నారు. అక్కడ కొద్ది రోజులుగా రైతులు పెద్ద సంఖ్యలో నిరసన చేస్తున్నారు.

‘‘వీళ్లందరూ చాలా మంచివాళ్లు. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం, తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళిపోవడం.. అలాంటిదేమీ లేదు. ఎంతో వినయంగా మాట్లాడతారు. ఎవరైనా ఇక్కడ తిని డబ్బులు ఇవ్వకుండా వెళిపోతే.. ఆ విషయం మరొకరికి తెలిస్తే, వాళ్లొచ్చి ఆ బిల్లు కట్టేసి వెళిపోతారు’’ అని రూబీ చెప్పారు.

‘‘ఎప్పుడూ మావల్ల ఏ ఇబ్బందీ లేదు కదమ్మా అని అడుగుతూనే ఉంటారు. వాళ్లు మాకు గౌరవం ఇవ్వండి అని అడగరు.. సొంతంగా సంపాదించుకుంటారు. ఎందుకంటే వీళ్లు అవతలివాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు.. ఆటోమేటిక్‌గా ఆవతలివాళ్లు వీళ్లను గౌరవిస్తారు’’ అని ఆమె వివరించారు.

‘‘వీళ్లని చూశాక... మేము దిల్లీలో కాకుండా పంజాబ్‌లో నివసిస్తూ ఉండుంటే ఎంత బావుండేది అనిపిస్తోంది’’ అని రూబీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)