‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు’ – పరకాల ప్రభాకర్‌

వీడియో క్యాప్షన్, ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు’ – పరకాల ప్రభాకర్‌
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు తన రాజధాని ఎక్కడ ఉందో తెలియకుండా అయోమయంలో, దిక్కుతోచకుండా నిలబడి ఉందని అంటూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ 'రాజధాని విషాదం - అమరావతి' పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు.

ఈ డాక్యుమెంటరీకి ప్రేరేపించిన అంశాలు, ఏపీ రాజధాని భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షితో మాట్లాడారు.

ఒక రాజధాని అంటూ లేకుండా తెలుగు ప్రజల పరిస్థితి ఇలా ఎందుకు మారిందనే ప్రశ్నను ప్రజల ముందుంచడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్ర చూస్తే ఒక సంచార జాతిగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు అమరావతి ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

రాజధాని, రైతుల సమస్యలతో ప్రత్యేక హోదా అంశం గురించి పరకాల ప్రభాకర్ ఏమన్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)