Farmers Protest: ఉద్రిక్తంగా మారిన రైతుల చలో దిల్లీ ఆందోళన

ప్రచురణ

సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.

రైతు సంఘాలు 'ఛలో దిల్లీ'కి పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున రైతులు దిల్లీకి బయలుదేరారు.

పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)