ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవచ్చా?

ప్రచురణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సమీపంలో ఉన్న లోంగేవాలా పోస్ట్‌ వద్ద మోదీ సైనిక దుస్తులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నర్‌వాణె, బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్థానా కూడా పాల్గొన్నారు.

ఆర్మీ దుస్తులు ధరించిన మోదీ, యుద్ధ ట్యాంక్‌ ఎక్కి కనిపించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యాయి.

అయితే మోదీ సైనిక దుస్తులలో కనిపించడం సోషల్ మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది.

ప్రజాస్వామ్య దేశంలో సైనిక యూనిఫామ్‌ ధరించే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందా లేదా అన్నదానిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.

సైన్యం నుంచి రిటైరైన వారి దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)