జీఆర్ గోపీనాథ్: మధ్యతరగతిని విమానం ఎక్కించిన కెప్టెన్

వీడియో క్యాప్షన్, జీఆర్ గోపీనాథ్: మధ్యతరగతిని విమానం ఎక్కించిన కెప్టెన్
ప్రచురణ

భారతదేశంలోని మొట్టమొదటి బడ్జెట్ విమానయాన సంస్థ వ్యవస్థాపకులు జీఆర్ గోపినాథ్ 2005 వేసవిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. భారతీయులు 'ఒక్క రూపాయి'కే విమానంలో ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.

ఆర్మీ నుంచీ పదవీ విరమణ పొందిన తరువాత వ్యాపారవేత్తగా మారిన గోపీనాథ్ 2003లో ఎయిర్ దక్కన్ పేరుతో ఒక విమానయాన సంస్థను స్థాపించి అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు సాధ్యమయ్యేలా చేశారు.

ఐరోపా నుంచీ ఈజీజెట్, రైయనెయిర్‌ లాంటి బడ్జెట్ విమానాలను ప్రయాణికులకు అనుగుణంగా మలచి, లక్షలాది భారతీయులు అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాలు చెయ్యగలిగేలా ఎయిర్ దక్కన్ సంస్థను రూపుదిద్దారు. అప్పట్లో ఎయిర్ దక్కన్ టికెట్ ధర మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరల్లో సగమే ఉండేది.

2005లో గోపీనాథ్ రెండు ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా టికెట్ బుక్ చేసుకునే కొద్దిమంది ప్రయాణికులకు టికెట్లను 'ఒక్క రూపాయి'కే విక్రయించారు. మిగతావారికి సాధారణ ఎయిర్ దక్కన్ ధరలకే టికెట్లు విక్రయించారు. అవి కూడా మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలకన్నా చాలా తక్కువగానే ఉండేవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)