You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ జగన్‌పై కోర్టు ధిక్కరణ కేసుకు సమ్మతి తెలపలేను - అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ - BBC Newsreel
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతి తెలియచేయడం సాధ్యపడదన్న తన నిర్ణయాన్ని పునః సమీక్షించేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కే కే వేణుగోపాల్ నిరాకరించారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్ఏ బాబ్డేకు రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియాకు విడుదల చేశారు.
ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ వైయస్ జగన్, అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చెయ్యాలని అభ్యర్థిస్తూ సుప్రీం కోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖను పరిగణలోకి తీసుకునేందుకు ఏజీ తొలుత నిరాకరించారు.
రెండోసారి ఇదే విషయమై ఉపాధ్యాయ రాసిన లేఖను ఏజీ వేణుగోపాల్ మరోమారు తిరస్కరించారు.
"అయితే, (ఏజీ) అసమ్మతి తెలియజేసినప్పటికీ, లాయరు ఉపాధ్యాయ వాస్తవాలను సుప్రీం కోర్టు ఎదుట హాజరుపరుస్తూ, సుమోటో యాక్షన్ తీసుకోమని అభ్యర్థించడానికి ఎలాంటి అడ్డు లేదు" అని వేణుగోపాల్ తన లేఖలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- మనుషులను రక్షించేందుకు పెట్టిన లాక్డౌన్ గుర్రాల ప్రాణాల మీదకు తెచ్చింది
- ‘రెండేళ్లుగా చెక్కులు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం’
- మన చేతిరాతను మార్చిన పెన్ను... ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి?
- జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు
- కమలా హారిస్: అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి మహిళ
- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎందుకింత ‘గందరగోళం’?
- అమెరికా కొత్త అధ్యక్షుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)