కమలా హారిస్ గెలవాలంటూ తమిళనాడు కుగ్రామంలో పూజలు
అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపు కోరుతూ తమిళనాడులోని ఒక చిన్న గ్రామం తులసెంథిరపురంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్ కమలా హారిస్ మూలాలు.. చెన్నై నగరానికి 350 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలోనే ఉన్నాయి.
ఆమె తాత (తల్లికి తండ్రి) పి.వి. గోపాలన్ ఈ గ్రామంలో నివసించేవారు. గోపాలన్ కుటుంబం ఇప్పుడు చెన్నైలో నివసిస్తోంది.
కమలా హారిస్ ఘన విజయం కోరుతూ గ్రామస్తులు తులసెంథిరపురంలోని ఆలయంలో ధర్మశాస్త విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ దేవుడు పి.వి.గోపాలన్ కులదైవం కూడా.
ఆయన ఐదేళ్ల వయసులో ఈ ఆలయానికి వచ్చాడని ఆలయ ట్రస్టీలు ఎస్.వి.రమణన్ చెప్తున్నారు. కమల మేనత్త సరళా గోపాలన్ ఇప్పటికీ ప్రతి ఏటా కొన్ని వేల రూపాయలు ఆలయానికి విరాళం పంపిస్తుంటారని కూడా తెలిపారు.
కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయటమే గ్రామంలోని యువతలో స్ఫూర్తి నింపిందని పూజా నిర్వాహకుల్లో ఒకరైన సుధాకర్ బీబీసీ తమిళంతో మాట్లాడుతూ చెప్పారు.
''అమెరికా ఎన్నికల ఫలితాల కోసం మేం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కమల గెలవాలని, మా గ్రామానికి మరింత ప్రతిష్ట తేవాలని మేం కోరుకుంటున్నాం'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?
- కెప్టెన్గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)