You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాందిస్తున్న గిరిజన మహిళలు
ఒకప్పుడు వాళ్లంతా రోజు కూలీలు. కానీ ఇప్పుడు రోజుకు వేలకు వేలు సంపాదిస్తున్న రైతులుగా ఎదిగారు.
గుజరాత్‌కు చెందిన ఈ గిరిజన మహిళలు కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
వీరిది వల్సాడ్ జిల్లా కప్రాడా తాలూకా వేరిబవాడ్ గ్రామం. కప్రాడా తాలూకాలోని వాళ్లు బతుకుదెరువు కోసం వలస పోతుండేవారు.
నీటి కొరత కారణంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది కాదు.
బీఐఏఎఫ్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ అనే సంస్థ సౌర శక్తి ద్వారా వీరి నీటి సమస్యకు పరిష్కారం చూపింది. వ్యవసాయం గురించి శిక్షణ కూడా ఇచ్చింది.
ఇప్పుడు ఇక్కడ రకరకాల కూరగాయలు పండుతున్నాయి.
గ్రామంలోని మహిళలు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కో బృందంలో పది మంది ఉంటారు.
వీరంతా కలిసి పనిచేస్తారు. పంటను నేరుగా టోకు వ్యాపారులకు అమ్ముతారు.
కూరగాయల సాగు ద్వారా వస్తున్న ఆదాయంతో ఇప్పుడు ఇక్కడి గిరిజన మహిళలు తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నాయి.
పోరాటపటిమతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్‌కి చైనాలో బ్యాంకు అకౌంట్ ఉంది: న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
- ‘పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేశారు’: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
- ప్రైవేటు కంపెనీలకు చోటివ్వకుండా భారత రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భరత’ సాధ్యమేనా?
- డీప్ ఫేక్ టెక్నాలజీ: లక్షకు పైగా మహిళల సోషల్ మీడియా ఫొటోలను నగ్నంగా మార్చేశారు..
- విజయవాడకు వరద ముప్పు తొలిగే మార్గం లేదా? ఎందుకు ఈ పరిస్థితి?
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)