Baba Ka Dhaba: కన్నీళ్లు పెట్టించే వీడియో ఈ వృద్ధజంట నడిపే హోటల్‌కు మళ్లీ గిరాకీ తెచ్చింది

వీడియో క్యాప్షన్, Baba Ka Dhaba: కన్నీళ్లు పెట్టించే వీడియో ఈ వృద్ధజంట నడిపే హోటల్‌కు మళ్లీ గిరాకీ తెచ్చింది
ప్రచురణ

ఒక వైరల్ ట్వీట్ ఈ వృద్ధ జంట కన్నీళ్లు తుడిచింది. సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో కళ తప్పిన ఆ 'బాబాయ్ హోటల్'కు మళ్లీ గిరాకీ వచ్చేలా చేసింది. అంతేనా... ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో కూడా ఇప్పుడా హోటల్ కనిపిస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా బేరాల్లేక ఆదాయం కోల్పోయిన 80 ఏళ్ల హోటల్ యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వందలాది మంది ఇప్పుడా హోటల్‌కు పోటెత్తుతున్నారు. తాము కడుపు నింపుకొని ఆ వృద్ధ జంట కడుపు నింపాలన్న సదుద్దేశంతో 'బాబా కా ధాబా' ముందు క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)