కరోనా రోగుల కోసం అంబులెన్స్ నడుపుతున్న ధీరవనిత

వీడియో క్యాప్షన్, మహిళా అంబులెన్స్ డ్రైవర్
ప్రచురణ

‘‘కరోనా సమయంలో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్కూల్ బస్సును కరోనా రోగుల కోసం నడపాల్సి ఉంటుందని చెప్పారు. నేను సరే అన్నా. ఉద్యోగంతోపాటు సమాజానికి సేవ చేసినట్లు ఉంటుందని అనిపించింది’’ అని నీలం సింగ్ చెప్పారు.

కరోనా సంక్షోభ సమయంలో ముంబయిలో అంబులెన్స్‌ల కొరత పెద్ద సమస్యగా మారింది. దీంతో స్కూల్ బస్సులను అంబులెన్సులుగా ఉపయోగించుకోవాలని ముంబయి నగరపాలక సంస్థ బీఎంసీ నిర్ణయం తీసుకుంది.

బీఎంసీలో కాంట్రక్టు డ్రైవర్‌గా ఉంటూ ఈ బస్సులను నడిపేందుకు నీలం సింగ్ ముందుకువచ్చారు.

నీలం అంధేరిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆమెకు డ్రైవింగ్ అంటే ఆసక్తి. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె దీన్నే వృత్తిగా ఎంచుకోవాల్సి వచ్చింది.

నీలం వయసు 55 ఏళ్లు. 18 ఏళ్లుగా ఆమె డ్రైవింగ్ చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా కరోనా రోగుల కోసం అంబులెన్స్ నడుపుతున్నారు.

ఈ పని చేస్తుండగా ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)