పాలు అమ్మి నెలకు రూ. 7 లక్షలు సంపాదిస్తున్న మహిళ

ప్రచురణ

గుజరాత్‌కు చెందిన కానుబెన్ కొన్నేళ్ల క్రితం బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఐదు ఆవులు కొన్నారు.

క్రమంగా ఆమె ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె వద్ద 150 దాకా సంకర జాతి ఆవులు, గేదెలు ఉన్నాయి.

వాటి కోసం అన్ని సదుపాయాలతో విశాలంగా ఉండేలా ఓ షెడ్‌ను నిర్మించారు.

బనాస్ డైయిరీకి ఈ షెడ్ నుంచి రోజూ 800 నుంచి వెయ్యి లీటర్ల దాకా పాలు వెళ్తుంటాయి.

మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు పాలన్‌పుర్ జిల్లాలో ఉన్న బనాస్ డెయిరీ తోడ్పడుతోంది.

ఈ డెయిరీకి పాలు అమ్ముతూ దాదాపు లక్షన్నర మంది మహిళలు ఒక్కొక్కరూ నెలకు లక్ష రూపాయలకుపైనే సంపాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)