కూలీల పిల్లలకు పాఠాలు చెప్తున్న ఆ టీచర్ వయసు 13 ఏళ్లు...

వీడియో క్యాప్షన్, కేరళ బాలిక
ప్రచురణ

ఇది స్మార్ట్ క్లాస్. గుడిసెను పట్టుకుని స్మార్ట్ క్లాస్ అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరి, అనామిక దీన్ని అలాగే పిలుస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులందరికీ టీచర్ అనామికే. కానీ, ఆమె వయసు 13 ఏళ్లు.

‘‘నా పేరు అనామిక. నేను త్రివేండ్రంలోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాను. కరోనా లాక్‌డౌన్ వల్ల నేను బడికి వెళ్లడం లేదు. మా చుట్టుపక్కల ఉండే పిల్లలది కూడా ఇదే పరిస్థితి.

ఇక్కడుండే పిల్లల తల్లిదండ్రులంతా దినసరికూలీలు. లాక్‌డౌన్ వల్ల చిన్నారులు ఖాళీగా ఉంటున్నారని, ఈ స్మార్ట్ క్లాస్ మొదలుపెట్టా. జులై 25 నుంచి ఇక్కడ పాఠాలు చెబుతున్నా’’ అని బీబీసీకి చెప్పింది అనామిక.

రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ తరగతులు జరుగుతాయి. చిన్నారులకు అనామిక గణితం, మలయాళం, తమిళం, జర్మన్, ఇంగ్లిష్ నేర్పిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)