కమలాదేవి చటోపాధ్యాయ: ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి భారతీయ మహిళ

ప్రచురణ

కమలాదేవి మంగళూరులో గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గిరిజాబాయి. తండ్రి అనంతయ్య ధరేశ్వర్ జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. ఆయన ప్రగతిశీల భావాలున్న వ్యక్తి. కానీ కమలాదేవి చిన్నతనంలోనే ఆయన మరణించారు. తరువాత కుటుంబ బాధ్యత అంతా ఆమె తల్లి మీద పడింది.

19వ శతాబ్దంలో బాలికలకు పాఠశాలలు లేనప్పటికీ ఇంటి దగ్గరే కమలాదేవికి చదువు చెప్పించే ఏర్పాటు చేసారు. కానీ సాంఘిక ఒత్తిడికి తలవొగ్గి 11 వ యేటనే కమలాదేవి వివాహం జరిపించారు.

తరువాత ఏడాదిన్నరకే కమలాదేవి భర్త మరణించారు. అయితే కమలాదేవికి వితంతు ఆచారాలను జరపడానికి ఆమె తల్లి నిరాకరించారు. అంతేకాకుండా కమలాదేవిని స్కూలుకు పంపి, జీవితంలో ముందుకు వెళ్లడానికి దారి చూపించారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)