స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్: ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేసే రహస్య దళం
1962లో ఏర్పడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వాస్తవానికి భారత సైన్యంలో భాగం కాదు. ఇది భారత ఇంటెలిజెన్స్ ఏజన్సీ.. రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ)లో భాగం.
హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం ఈ సంస్థ కార్యకలాపాలను చాలా రహస్యంగా ఉంచుతారు. బహుశా భారత సైన్యానికి కూడా తెలియకపోవచ్చు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా వీరు ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. అందుకే వీరు చేసే పనులు సామాన్య ప్రజలకు తెలియవు.
ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థాపక అధ్యక్షుడు భోలానాథ్ మల్లిక్, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ సలహాలమేరకు హిమాలయా సరిహద్దు ప్రాంతాల్లో చైనీయులతో తలపడగలిగే టిబెటన్ గెరిల్లా బృందాన్ని తయారుచేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచన చేశారు.
యుద్ధ సమయంలో చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో మొదలైన ఎస్ఎఫ్ఎఫ్‌కు మొట్టమొదటి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా మాజీ మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబాన్ వ్యవహరించారు.
సుజాన్ సింగ్ ఉబాన్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ భారత సైన్యం తరపున '22 మౌంటెన్ రెజిమెంట్' కమాండర్‌గా ఉన్నారు. అందువల్ల ఎస్ఎఫ్ఎఫ్‌ను 'ఎస్టాబ్లిష్మెంట్ 22' అని కూడా పిలుస్తారు.
ఇవి కూడా చదవండి:
- కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ పై యుద్ధం చేస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి పంచాలంటే ‘8000 జంబో జెట్లు సరిపోతాయా ?
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో తాగలేక, బయటకు వెళ్లలేక...మద్యం మానేస్తారా ?
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- అమెరికా ఎన్నికలు: భారతీయ హిందూ ఓట్లు ట్రంప్‌కేనా? డెమొక్రాట్లు భయపడుతున్నారా?
- కరోనావైరస్: అమెరికా, బ్రెజిల్ కాదు మరణాల రేటులో ఈ దేశమే టాప్
- అంతర్వేదిలో అసలేమైంది.. రథం చుట్టూ రాజుకుంటున్న వివాదంలో బీజేపీ, జనసేన నేతల గృహ నిర్బంధం
- కరోనావైరస్: 73 ఏళ్ల క్రితం ఈ నవలలో రాసినట్టే అంతా జరుగనుందా?
- కరోనా టెస్టుల పేరుతో తీసుకెళ్లి కిడ్నీలు కాజేస్తున్నారా?
- వలంటీర్లకు అస్వస్థతతో ఆగిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ ట్రయల్స్
- లద్ధాఖ్ సెక్టార్లో కొడవళ్లు బిగించిన కర్రలతో మోహరించిన చైనా సైనికులు’
- బెంగళూరు యువతికి కరోనావైరస్ రెండోసారి సోకిందన్న అనుమానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)