అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ

ప్రచురణ

అహ్మదాబాద్‌లోని ఓ ధనిక కుటుంబంలో 1885లో అనసూయ జన్మించారు. చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులను కోల్పోయారు. పినతండ్రే ఆమెను పెంచారు.

అప్పటి సంప్రదాయాల ప్రకారం 13ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లి నిలబడలేదు. కొన్ని రోజులకే ఆమె మళ్లీ వెనక్కి వచ్చేశారు.

దీంతో సోదరుడు అంబాలాల్ చదువుకోవాలని ఆమెను ప్రోత్సహించారు. ఉన్నత విద్య కోసం ఆమెను లండన్ కూడా పంపించారు.

లండన్‌లో చదువు ఆమెపై చాలా ప్రభావం చూపింది. సోషలిజంలోని ఫేబియన్ ఫిలాసఫీ నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. ఇంగ్లండ్‌లోని మహిళా హక్కుల ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ ఘటనలే ఆమె భవిష్యత్‌ను మార్చివేశాయి.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)