భర్త, మరిది, మామ ఆత్మహత్య చేసుకున్నా.. ట్రాక్టర్ కొని వ్యవసాయం చేస్తున్న ధీర వనిత

ప్రచురణ

అకోలా జిల్లాలోని కట్యార్ గ్రామంలో నివసిస్తున్నారు జ్యోతి. ఆమెది వ్యవసాయ కుటుంబం.

ఆమె భర్త, మరిది, మామ అందరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

కానీ జ్యోతి మాత్రం వ్యవసాయంపై ఆశ వదులుకోలేదు.

ఆమె ఇప్పుడు 29 ఎకరాలు సాగు చేస్తున్నారు. పొలంలో అవసరమైన పనులన్నీ తానే చేసుకుంటారు.

జ్యోతి తాయి ఈ స్థాయికి అంత సులభంగా చేరుకోలేదు.

కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో మీ పొలం అమ్మేయడం మంచిదని ఆమెకు కొందరు సలహా ఇచ్చారు.

‘‘పొలం అమ్మేసి ఇంట్లో ఉండండి. దేశ్‌ముఖ్ కుటుంబంలో వాళ్లు ఇలా పొలం పనులు చేయకూడదు' అంటూ నాకు చాలా మంది చాలా చెప్పారు. నేను పొలాల్లో చెత్తపనులన్నీ చేస్తున్నానన్నారు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు’’ అంటారామె.

ఏమీ తెలియకున్నా వ్యవసాయం ఎందుకు చేస్తున్నారని అడిగినపుడు ఆమె ఏమన్నారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)