కరోనా ఎఫెక్ట్: వస్తుమార్పిడి విధానం పాటిస్తున్న గ్రామస్తులు

ప్రచురణ

పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. అంటే మీకు కావాల్సిన వస్తువు తీసుకుని, మరో వస్తువును వాళ్లకు ఇవ్వడమన్న మాట. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అలాంటి పద్ధతినే పాటిస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పినందుకు ఉపాధ్యాయులకు డబ్బులివ్వకుండా కూరగాయలు, బియ్యం ఇస్తున్నారు. బీబీసీ ప్రతినిధి డెవీనా గుప్తా అందిస్తున్న కథనం.

కరోనా వైరస్ ఆంక్షలతో భారత్‌లో 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యునెస్కో చెబుతోంది. పట్టణాల్లోని కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ బాట పట్టాయి. కానీ గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. అందుకే అక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో పాఠాలు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో 70శాతం గ్రామీణ ప్రజల నెలవారి ఆదాయం తగ్గిపోయిందని ఒక అధ్యయనం అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, విద్యార్థుల్లో ఉన్న డిజిటల్ అసమానతలను ఈ వస్తు మార్పిడి విధానం ఎత్తిచూపుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)