You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా లాక్‌డౌన్ కారణంగా క్షయకు మందులు కరవు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు.
టీబీ కారణంగా ఇండియాలో ఏటా 4,80,000 మరణాలు సంభవిస్తున్నాయి.
భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం క్షయ కారణంగా దేశంలో రోజుకి 1,300 మంది చనిపోతున్నారు.
గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అంతం కావడం లేదు. అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారు.
ఇవన్నీ కరోనావైరస్ వ్యాప్తికి ముందు సేకరించిన గణాంకాలు. జనవరి చివరివారంలో ఇండియాలో కోవిడ్-19 రావడం మొదలై, మార్చినాటికి లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీబీ వ్యాధికి సంబంధించిన గణాంకాలు సగానికి సగం పడిపోయాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్‌లలో క్షయవ్యాధి అధికంగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మొత్తం దృష్టిని కోవిడ్-19 కేసుల వైపు మరలించవలసి వచ్చిందని బీహార్ ప్రధాన టీబీ అధికారి డాక్టర్ కేఎన్ సహాయ్ అంటున్నారు.
"ముందే సిబ్బంది కొరత ఉంది. ఉన్నవారికి కూడా కోవిడ్-19 కేర్ సెంటర్లలో బాధ్యతలు అప్పగించారు. కొందరికి ఇంటింటికెళ్లి నమూనాలు సేకరించే పని ఇచ్చారు. ఇదీ ప్రభుత్వ కేంద్రాల పరిస్థితి. దాదాపు అన్ని ప్రైవేట్ టీబీ క్లినిక్‌లు మూసివేశారు. దీంతో క్షయ కేసుల నోటిఫికేషన్ 30 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది" అని డా. సహాయ్ తెలిపారు.
ఎంతోమంది క్షయ బాధితులు లాక్‌డౌన్ సమయంలో వైద్యం అందక, మందులు లేక అవస్థలు పడ్డారు. చాలామందికి చికిత్స మధ్యలోనే ఆగిపోయింది.
సమస్య ఏమిటంటే ఈ మందులు జపాన్‌లో తయారై భారతదేశానికి దిగుమతి అవుతాయి. లాక్‌డౌన్ కారణంగా అన్ని రవాణాలు నిలిచిపోవడంతో అక్కడి నుంచి మందుల సరఫరా ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నల్లజాతి వ్యక్తిపై కాల్పులు... నిరసనలతో రగులుతున్న విస్కాన్సిన్ స్టేట్
- బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)