శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు

వీడియో క్యాప్షన్, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు
ప్రచురణ

శ్రీశైలం జలాశయం ఎడమ గట్టువైపు ఉన్న తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 19 మంది సిబ్బంది ప్లాంటులోపల ఉన్నారని జెన్‌కో వర్గాలు వెల్లడించాయి.

900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంటులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి.

మొదటి యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు, పొగ పెద్ద ఎత్తున చెలరేగాయని కొన్ని వీడియోలను చూస్తే అర్థమవుతోంది.

ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి మీడియాతో అన్నారు.

మొత్తం తొమ్మిది మంది లోపల చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని, సింగరేణి సహకారం కూడా కోరామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)