సిలికాన్ వ్యాక్స్ ప్రతిమ: చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం

వీడియో క్యాప్షన్, సిలికాన్ వ్యాక్స్ ప్రతిమ: చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం
ప్రచురణ

మనిషి సజీవంగా ఉన్నట్లు కనిపించే ప్రతిమ ఇది. చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఒక తెలుగు పారిశ్రామికవేత్త ఈ ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రతిమతోనే ఆయన గృహప్రవేశం చేశారు.

మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్య వెంకట నాగ మాధవి ప్రతిమను సిలికాన్ వ్యాక్స్‌తో తయారు చేయించినట్లు శ్రీనివాస్ గుప్తా చెప్పారు. ఒక మంచి ఇళ్లు కట్టుకోవాలని మాధవి తనతో ఎప్పుడూ చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రతిమతోనే గృహ ప్రవేశం చేశానని ఆయన బీబీసీ ప్రతినిధితో చెప్పారు.

శ్రీనివాస్ గుప్తా, వెంకట నాగ మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. దాదాపు 32 ఏళ్ల క్రితం కర్నాటకలోని కొప్పల్‌ ప్రాంతంలో ఆయన కుటుంబం స్థిరపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)