సోనూ సూద్: చిత్తూరు రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన నటుడు

వీడియో క్యాప్షన్, సోనూ సూద్: తెలుగు రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన నటుడు
ప్రచురణ

చిత్తూరు జిల్లా మహల్‌రాజుపల్లి గ్రామంలో కాడెద్దులుగా మారిన అక్క చెల్లెళ్ల వీడియో చూసిన సోన్ సూద్... రోజు తిరక్కుండానే వాళ్లింటికి కొత్త ట్రాక్టర్ పంపించారు.

ముందుగా వాళ్లకు రెండు ఎద్దులు ఇద్దామనుకున్న ఆయన, ఆపై మనసు మార్చుకుని ట్రాక్టర్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అన్నట్లుగానే సాయంత్రం కల్లా వాళ్లింటికి ట్రాక్టర్ పంపించేశారు. ఇకపై ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)